పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0255-3 మంగళకాశిక సం: 09-027

పల్లవి:

మనసుకు మనసే మర్మము గాక
వినికివలెఁ దనకు విన్నవించఁ గలనా

చ. 1:

తలుపులో తమకము తానె యెరఁగ డట
యెలమిఁ దన్నుఁ గొసర నేలె నాకూ
కలిమిఁ జంద్రునిరాక కలువపువ్వులకును
తెలిపిరా యెవ్వరైన దినదినమునకు

చ. 2:

తప్పక వరు సెరిఁగి తానె విచ్చేయుఁ డట
యిప్పుడు విలువ నంప నేలె నాకూ
వుపతిల్లుఁ గోవిలకు నొగి వసంతకాలము
చెప్పుదురా యెవ్వరైనఁ జెలఁగి యేఁటేఁటను

చ. 3:

దగ్గరి వచ్చినవాఁడు తానె యెరుఁగుఁ గాక
యెగ్గు సిగ్గు లిటు దీర్చ నేలెనాకు
అగ్గమై శ్రీవెంకటేశుఁ డాదరించి నన్నుఁ గూడె
నిగ్గు నిలువుకు నీడ నేర్పిరా యితరులు