పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0255-2 సామంతం సం: 09-026

పల్లవి:

వెఱపించఁ బోయి మరి వెఱచినట్టయ్యీఁ జుమ్మీ
నెఱి నాతోడి యలుక నీతిగాదు సుమ్మీ

చ. 1:

మోనముతో నుండే వేమె ముదిత నీమాట లెల్ల
నాని నాని మొలచీఁ గనక లోలోనె
ఆనకమై నవ్వ వేమె అంగన నీనగవులు
వూని నీకుత్తికెలోన వుక్కిపోవుఁ జుమ్మీ

చ. 2:

ధీరతఁ జూడ వదేమె తెరవ నీకనుచూపు
కేరి యిమ్ముచాలక కిక్కిరిసీఁ జుమ్మీ
మారుమోమయ్యే వదేమె మగువ నీమోము కళలు
పేరడై వొక్కచోటనె పెంటలయ్యీఁ జుమ్మీ

చ. 3:

వుసురనే వప్పుడేమె వువిద నాకాఁగిటిలో
వుసురు నీచనుఁగొండ లోడీఁ జుమ్మీ
నసల శ్రీ వెంకటేశుఁడ నారతిమై మఱచేవు
కనుగాటై నీమోవి గంటివడుఁ జుమ్మీ