పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0297-1 గౌళ సం: 09-277

పల్లవి:

ఎట్టుండెనో నీభాగ్య మేనోము నోచెనో ఆకె
గుట్టుతోనె నీవలపు‌ కొల్లగొనెఁ గదరా

చ. 1:

నీటున వయ్యాళి వోయి నీవురాగా నదె చెలి
కోటకొమ్మ నొరగుండి గొబ్బునఁ జూచి
గాఁటపుఁ జన్నులు గొంత గానరాఁగాఁ జూపి మోపి
మాటలాడి యాపె నీమనసు గరఁచెఁగా

చ. 2:

యేనుగ పై నిలుచుండి యింతికిఁ జెయిచాఁచఁగాని
న్నానించి యెక్కించి తనఅండకుఁ దీ సి
మేను మేను గాఁగిలించి మెచ్చి మెచ్చి తనయింటి
లోనికిఁ బిలించి నిన్ను లోలునిఁగాఁ జేసెఁగా

చ. 3:

వాకిటికి నీవురాఁగా వనిత సన్నలుసేసి
చేకొని నన్నిటు గని శ్రీవెంకటేశ
యీకొలఁదులను మన మిద్దరముఁ గూడితిమి
నీకు నాకుఁ దాఁ జుట్టమై నేరుపున నవ్వెఁగా