పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0296-4 సౌరాష్ట్రం సం: 09-274

పల్లవి:

ఇంటిలోనున్నదానను యెప్పుడూఁ దనసామ్మె
వెంటవచ్చినవారితో వేగఁ గూడుమనవే

చ. 1:

పలుకనివారి నేలపలికించీనె తాను
చలములు మాతోనె సాదించీనా
వలచివచ్చినవారు వాకిటఁ గాచుకున్నారు
అలరి ముచ్చట లందె యాడుమనవే

చ. 2:

దగ్గరనివారి నేల దండకుఁ దీసీనె తాను
నిగ్గుల మాతోనె యివి నేర్చుకొనీనా
సిగ్గువడనివా రదె చేసూటినెవున్నవారు
కగ్గులేక గొబ్బుననుఁ గాఁగిలించుమనవే

చ. 3:

నగనివారి నదేల నగుమనీనె తాను
పగటులు మాతోనె పచరించీనా
జిగి నన్నుఁ గలసెను శ్రీవెంకటేశుఁడు తాను
మొగముచూచేవారిని మొరఁగు కొమ్మనవే