పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0296-3 పాడి సం: 09-273

పల్లవి:

ఎందుకైనా వత్తువు నిన్నేమిసేతురా
యిందరిలోపల నిన్ను నేమిసేతురా

చ. 1:

చెక్కులూ నొక్కితి నీకు చేతులెత్తి మొక్కితిని
యెక్కడా నీవోజ మాన వేమిసేతురా
తక్కరివాఁడవుతొల్లె దగ్గరి నేనంటితేను
యిక్కువలూఁ గరఁగేవు యేమి సేతురా

చ. 2:

కొచ్చి వెంగేలు నాడితి కొంగువట్టి తీసితిని
హెచ్చిన పరాకుమాన వేమి సేతురా
మెచ్చనివాఁడవు మున్నె మీరి నేఁ జెనకితేను
యిచ్చకములాడవచ్చే వేమిసేతురా

చ. 3:

కన్నులాను జంకించితి కాఁగిటాఁ గూడితి నిన్ను
యెన్నేసి బాసలు సేసే వేమిసేతురా
మన్నించి కూడితి నాఁడె మక్కువ శ్రీవెంకటేశ
యిన్నిటా రతులఁజొక్కే వేమిసేతురా