పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0295-3 శుద్ధవసంతం సం: 09-267

పల్లవి:

వట్టి పెద్దరికా లీడ వడినేల చెప్పేవు
తిట్టినవెనక నాపె దీవించఁబోలు

చ. 1:

వొకతె పైఁ బెట్టి మాట లొకలొకటెయాడి
యెకసక్కేలకుఁ గల్ల లేలయాడేవు
ప్రకటించి రమ్మనుచు పాదాలువట్టునా ఆపె
తకపికలుగను ముందల పట్టఁబోలు

చ. 2:

వలచివచ్చె ననుచు వట్టి సాకిరులు వెట్టి
చలివాసి నీవేల బాసలు సేసేవు
పిలిచి నీయింటి కాపె ప్రియము చెప్పవచ్చెనా
వలవంత నిల్లురికి వాదుకురాఁబోలు

చ. 3:

యీవేళ విడెము లంచమిచ్చి యాకెగూడె నని
శ్రీవెంకటేశ్వర నీవె సిగ్గువడేవు
కామించి నన్నుఁగూడితి కప్పమువెట్టునా ఆప
మోవని నోరినిండాఁ దమ్ములమిడఁబోలు