పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0294-2 భైరవి సం: 09-260

పల్లవి:

మామాటవినవెకొంత మన్నించి నీవు
నీమనసు కోరికల నేరుపులలోనా

చ. 1:

మొక్కకువె నిన్నతఁడు మొగము చూచినదాఁక
గుక్కుచు నింతుల పెద్దకొలువులోన
పెక్కుమాట లాడకువె పేరఁ బిలిచినదాఁక
అక్కరైన సరసపుటాసలలోన

చ. 2:

కేరి నవ్వకువె తానె కేలు పయిచాఁచినదాఁక
సారమైన వలపుల సందడిలోన
ఆరసి చూడకువె నిన్నాయము లంటినదాఁక
బీరపు తమకముల పెనఁగులలోన

చ. 3:

కొసరకువె యాతఁడు గొబ్బునఁ గూడినదాఁక
ముసగసల యాకతముల మీలోన
యెసగి శ్రీవెంకటేశుఁడ డిదివో నిన్నుఁ గలసె
ఆసురుసురుగాకు నెయ్యములలోన