పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0294-1 కన్నడగౌళ సం: 09-259

పల్లవి:

ప్రియములెల్లా నీవి బిగువు నాది
దయలేనిదాన యేలో తగిలేవొ కాని

చ. 1:

చెక్కులు నీవు నొక్కఁగ సిగ్గువడ్డదాన నేను
యెక్కడికెక్కిన మాట లేమాడేవు
మొక్కులు నీవు మొక్కఁగ మోనాననుందాననేను
చొక్కుల నీ కేనాటి చుట్టమునొ నేను

చ. 2:

సరసము నీవాడఁగ జంకించినదాన నేను
యెరవులపొందు నాతో నే సేసేవు
సిర నీవు ముట్టఁగ చెనకకుందాన నేను
సరిగా నీ కెటువలెఁ జవులైతి నేను

చ. 3:

నీవు గాఁగిలించుకోఁగ నివ్వెరగందితి నేను
చేవదేరెఁ బను లెంత సేసేవు నీవు
శ్రీవెంకటేశ్వర నన్నుఁ జేకొని కూడితి విట్టె
సేవగా నిచ్చక మెంతసేసితినొ నేను