పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0293-6 శంకరాభరణం సం: 09-258

పల్లవి:

వద్దేలె బలిమి వసముగాఁ డిఁక
బుద్దెరిఁగి తానె పొదిగీఁ గాకా

చ. 1:

వలవనివారిని వలపించఁబోతే
వెలికి లోనికె వేసటలే
ములిగేటివారి మోపుమోవుమంటే
కొలఁదిమీరిన కోపమురాదా

చ. 2:

మాటాడనివారి మాటాడించఁబోతే
తాటించి యెగ్గులుఁ దప్పులునే
పోటిదొరలతోఁ బొందులు సేసితే
సాటికిఁ బేటికి జంపులెకావా

చ. 3:

వూరకున్నవారి నొడివట్టితేను
బీరాలతో వట్టిపెనఁగులే
యీరీతి శ్రీవెంకటేశుఁడు గూడెను
నేరుపులకెల్ల నేగురిగాదా