పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0293-2 ముఖారి సం: 09-254

పల్లవి:

నలుగడ నిందరు నవ్వేరు
పెలుచై తానేల బెదరీనే

చ. 1:

నెయ్యపు మాటలు నీతోఁ జెప్పఁగ
వొయ్యనె తానేల వొరసీనే
అయ్యెడ నిజమరి అట్టెవుండక
కయ్యానఁ దానేల కలఁగీనే

చ. 2:

తగవుకు నే నినుఁ దప్పక చూచిన
అగడుగఁ దానేల అడిగీనే
మొగమోటకాఁడు మోనాన నుండక
బెగడి ఆనేఁటికిఁ బెట్టెనే

చ. 3:

లోఁగుచు నే నిను లోనికిఁ బిలువఁగ
కాఁగిట తానేల కదిమీనే
వీఁగక కూడె శ్రీవెంకటేశ్వరుఁడు
పాఁగి తానేఁటికి భ్రమసీనే