పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0293-1 శంకరాభరణం సం: 09-253

పల్లవి:

ఏల వేగిరించేవు యిట్టె నిన్నుఁ బంగించి
మేలిమి చేఁతలుచూపి మెప్పించెఁ జుమ్మీ

చ. 1:

నయగారి మాటలాడి నవ్వులు మాతో నవ్వేది
నియతము నీకుఁ దొల్లె నేఁడు గొత్తలా
ప్రియము నిన్నుఁ జేయించి బిగుసుకుండేవారు
కయివసముగ నీపైఁ గలిగేరు సుమ్మీ

చ. 2:

చాయల వలపుచల్లి సరస మాడేది నాతో
నీయందు గలిగినవే నేఁడు గొత్తలా
మాయలు నీతో నడపి మరులు గొలిపేవారు
కాయపుఁజుట్టాలే నీకుఁ గలిగేరు సుమ్మీ

చ. 3:

అడరి శ్రీవెంకటేశ అన్నిటా గెలుతువు యీ
నిడుదమొక్కులు దొల్లె నేఁడు గొత్తలా
యెడయక నన్నుఁ గూడి తిది చూచి సిగ్గువడి
కడకుఁ దొలఁగేవారు గలిగేరు సుమ్మీ