పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0292-3 గౌళ సం: 09-249

పల్లవి:

పచ్చిదేరెఁ బనులు పమ్ముఁ జూపు మొనలు
హెచ్చె నిదె నామాట లియ్యకొనరాదా

చ. 1:

చెక్కుల నీ మెరుఁగు చిత్తజుని కరఁగు
యెక్కువ సిగ్గులఁ దల యేలవంచేవే
తక్కులేలె యింకను తగులాయ బొంకను
చక్కని నీ కెమ్మోవి చవిచూపరాదా

చ. 2:

మొలక నీ నగవు మోహముల తగవు
చెలఁగి నీ వది యేల చేతఁ గప్పేవే
పిలువవే యింటికి ప్రియమాయఁ గంటికి
తలఁచుక నీమాటకు దయఁజూడరాదా

చ. 3:

జంటల నీ చన్నులు జవ్వనపు టెన్నులు
అంటఁగాఁ బయ్యద నేల అట్టె మూసేవే
వెంటనే కూడితివి శ్రీవెంకటేశుఁడను నేను
పెంటలుగ నిట్లానె పెనఁగఁగరాదా