పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0254-6 లలిత సం: 09-024

పల్లవి:

ఇక నేలయ్య మా యెడమాటలు
మొకమొక మెదుటనె ముయికి ముయాయ

చ. 1:

సుదతికి నీచూపు సూసకమై చెలువిందె
కది సాకెచూపు బాసికము నీ కాయ
యెదుర నీకు నాకెకు నిద్దరి మీచిఱునవ్వు
వెదచల్లు కప్పురపు విడెము లాయ

చ. 2:

తొయ్యలికిఁ బేసన్నఁ దోరణపుఁ జిగు రాయ
యెయ్యెడఁ దొయ్యలిమోహ మీడుదో డాయ
యియ్యెడ నాయెడ మీయిద్దరి సరసములు
కయ్యములులేని కంకణదారా లాయ

చ. 3:

నెలఁతకు నీమోవి నిచ్చ కొత్తవిందులాయ
పొలఁతిమోవి నీకు బువ్వము లాయ
యెలమి శ్రీ వెంకటేశ యిద్దరి మీకూటములు
కలకాలమును మీకుఁ గాణాచు లాయ