పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0291-6 శుద్దవసంతం సం: 09-246

పల్లవి:

ఇచ్చగించుకొంట గాక యింపులే కలిగితేను
అచ్చలానఁ బెనఁగితే నది జాణతనమా

చ. 1:

తగులనాడినప్పుడు తమకించి నప్పుడును
జగడాలకుఁ బెనఁగ జాణతనమా
నగఁ దలఁచి నప్పుడు నాఁటఁ జూచినప్పుడును
అగడుసేయఁ బూనితే నది జాణతనమా

చ. 2:

కూరిమి చల్లినప్పుడు కొంగు వట్టినప్పుడును
సారె నూరకె వుండేది జాణతనమా
మేర మీరినప్పుడును మిక్కిలి లోనైన ప్పుడు
ఆరీతి మాటలాడే దది జాణతనమా

చ. 3:

కందువ లంటినప్పుడు కాఁగిలించి నప్పుడును
చందము సేసుకోకున్న జాణతనమా
యిందులోనె శ్రీవెంకటేశుఁడు ని న్నిదెకూడె
అందుకేలె వెరగందే వది జాణతనమా