పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0291-5 సామంతం సం: 09-245

పల్లవి:

నన్నుఁ జూచి నీవేల నవ్వే విఁక
యిన్ని సుద్దులకు నెల్లా యియ్యకొందువు గాక

చ. 1:

కన్నుల మొక్కినది కందువ చూపినది
యెన్నేసి చేఁతలు చేసీ నీపిన్నది
సన్నలు చేసినది చనవు మెరసినది
పన్నుగడలాఁ దొల్లె పనిగొందువు గాకా

చ. 2:

ఆయాలు మోపినది ఆసలు రేఁచినది
యేయెడఁ జూచిన నీతో నీపిన్నది
చాయకుఁ దెచ్చినది సరస మాడినది
కాయముల కళలెక్కఁ గైకొందువు గాకా

చ. 3:

చేతులు చాఁచినది సేసలు వెట్టినది
యేతుల శ్రీవెంకటేశ యీ పిన్నది
నాతోఁ గూడించినది నలి నిన్నుఁ గడపలో
రాతిరిఁ బగలు నిట్టె రమింతువు గాకా