పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0291-3 శ్రీరాగం సం: 09-243

పల్లవి:

మాటలు యింకానా మానరు మీరు
నాటికి నేటికి మేలు నయమాయనే

చ. 1:

తెల్లనాయఁ గన్నులు తేనెగారెఁ గెమ్మోవి
వల్లెవాటుతోనున్నాఁడు వాఁడె చూడరే
పొల్లవద్దనుంటిరి పూనుక వచ్చితిరి
కల్లలు నిజము నందె కానవచ్చెనే

చ. 2:

వింతవాసనలు నించె వెల్లులాయఁ జెమటలు
పంతముతోనున్నవాఁ డప్పటిఁ జూడరే
యింతులెల్లఁ గూడితిరి యియ్యకోలు సేసితిరి
యింతలోనె పాడిఁబంతా లెన్నికాయనే

చ. 3:

చెక్కులెల్లఁ బులకించె చెలికిఁ జెయిలోనాయ
వెక్కసాన దగ్గరీని వీఁడె చూడరే
యిక్కడ శ్రీవెంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
యెక్కువ తక్కువ లెల్లా నెంచనేఁటికే