పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0290-4 రామక్రియ సం: 09-238

పల్లవి:

ఎంతటి వేగిరకాఁడు యేమే తాను
చెంతల నిలుచుంటే నే చెరఁగువట్టీనా

చ. 1:

కోపగించ వద్దు గాక కొసరవద్దంటీనా
తీపులువెట్టుక యాలో తిట్టీఁగాకా
యీపనికి నే నవ్వి యిందరివలెనె కొంత
చూపులు పై మోపితేనె సుంకము గొనీనా

చ. 2:

బీర మాడవద్దు గాక పెనఁగవద్దంటినా
కేరడాన నేఁటీకో జంకించీఁ గాక
గోరగీరీని చెమటకుమ్మరించఁ జోటులేక
జోరునఁ బైఁ జిమ్మితేనె సూళ్లువట్టీనా

చ. 3:

కాఁక రేఁచవద్దు గాక కలయవద్దంటినా
వేఁకపుఁదావులు యాలో వేసీఁ గాక
యేఁకటతో శ్రీవెకంటేశుఁడె తా నన్నుఁ గూడె
సోఁకె చన్ను మొనలకు జోడుదొడిగీనా