పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0290-3 ముఖారి సం: 09-237

పల్లవి:

కదిసితి రిద్దరూను కడమ లేలా
పొదిగి చెలులుచెప్పే బుద్దులెల్లా వినవే

చ. 1:

వద్దేలెకోపము వలవని తాపము
సుద్దులు విన్నందుకె సూడువట్టేవా
చద్దులాయను వొట్లు చలము సాధించనేల
గద్దించినందు కతనిఁ గాఁగిలించుకొనవే

చ. 2:

యేమిటికే బిగువు యింకానా తగవు
మోము చూచి నవ్వితేనె మోపుగట్టేవా
నాములెక్కెఁ బంతములు నాలిసేయ నిఁకనేల
కై మీరినందు కతనిఁ గాఁగిలించుకొనవే

చ. 3:

అలయకువే నీవు అప్పటి సొలయకువే
తలఁపులో రతులు పాఁతరఁ బెట్టేవా
యెలమి శ్రీవెంకటేశుఁ డింపు సేసి నిన్నుఁ గూడె
కలఁక లన్నియుఁ బాసె కాఁగిలించుకొనవే