పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0290-1 మెంచభౌళి సం: 09-235

పల్లవి:

ఔదువుజాణవు నీవు అన్నీ నెరుంగుదుము
నీ దొరతనము లెల్ల నెలఁతపయినా

చ. 1:

చెనకి ఆపె నీకుఁ జేసిన మేలుకును
ననిచి నీ కన్నులను నాటఁ జూచేదా
చనవిచ్చి కమ్మటిని చన్నుల నొత్తినందుకు
పనిలేని బీరాలతో పంతమాడేదా

చ. 2:

లలన నిన్నుఁ దిట్టి లాలించిన లాలనకు
చలపట్టి బొమ్మలను జంకించేదా
నెలవుగ నీ మేను నిమిరినందుకు నీవు
కొలఁదిలేని తిట్లఁ గోపగించేదా

చ. 3:

కందువ నీ దేవి నిన్నుఁ గాఁగిట నించినందుకు
చందముసేసుక నీవు సారె నవ్వేదా
యిందునె శ్రీవెంకటేశ యిద్దరూ నొక్కటైతిరి
యిందరిలోపల నీవు యెమ్మెలాడేదా