పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0289-6 దేసాళం సం: 09-234

పల్లవి:

నిన్నటి మొన్నటికాఁక నేఁ డేఁటికే
యెన్నికెతో రమణుఁడ యియ్యకో లైతివి

చ. 1:

మక్కువ నాపైఁజల్లి మన్ననలు నించితివి
యెక్కడి సుద్దులు నీకు నేమి చెప్పేము
చెక్కులూనుఁ బులకించె చేతు లిట్టె చెమరించె
వెక్కసాననె నిన్ను వెంగెమాడ నేఁటికే

చ. 2:

మెచ్చి నన్నుఁ బొగడుచు మీఁదఁ జేయి వేసితివి
మచ్చరాలుఁ గపటాలు మానితి మిఁక
పచ్చడము గప్పఁగాను భావ మెల్లఁ గరఁగితి
కొచ్చి కొచ్చి యిఁక నిన్నుఁ గొర నేమిటికే

చ. 3:

కన్నుఁ గొనలనె నవ్వి కాఁగిట నన్నుఁ గూడితి
వెన్నెని సంతోసాలు యిఁక నెంచేము
వున్నతి శ్రీవెంకటేశ వొద్దికైతి మిద్దరము
పన్నుకొని వాసిరేఁచే పంతము లేమిటికే