పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0289-4 వరాళి సం: 09-232

పల్లవి:

మీరు మీరు నొక్కటే మీఁద నన్నీ మంచివే
ఆరితేరె మీ వంక నలయించకువ మ్మా

చ. 1:

చెంతల నాతఁడు నీ చెక్కు నొక్కి వేఁడుకొనీ
పంతము దప్పదు నేఁడు పలుకవమ్మా
యంతలే దీ యలుకలు యెవ్వరికి సతమాయ
వింతదానఁ గాను సిగ్గు విడువవమ్మా

చ. 2:

పక్కన నీరమణుఁడు పచ్చడము గప్పెనదే
వెక్కసపు సాదనలఁ గట్టుకొనే దేమున్నది
కక్కసపు సాదనలఁ గట్టుకొనే దేమున్నది
యిక్కడ ననుమానించే వెవ్వ రున్నారమ్మా

చ. 3:

శ్రీ వెంకటేశ్వరుఁడు చేరి నిన్నుఁ గూడె నిదె
చేవదేరెఁ గెమ్మోవి చెలఁగవమ్మా
వేవేలు చెప్పినాను వేడుకకు వెలలేదు
మోవులనె నవ్వేవు మొరఁగ నే లమ్మా