పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0289-2 నాదరామక్రియ సం: 09-230

పల్లవి:

విన్నప మేఁటికి వేమారు
పన్నిన కరఁగులఁ బదరీఁ జెలియా

చ. 1:

ముసి ముసి నవ్వుల ముంగారు ముంపులు
వసివాడుఁ జెమట వానలు
ముసుఁగుల సిగ్గుల మూడామంచులు
కుసుమై వలపులె కురిసీఁ జెలియా

చ. 2:

కన్నుల తేటల కప్పుర మాకుల
సన్నపు నిట్టూర్పు సంపెంగల
చిన్ని నెరిఁ గురుల చీఁకటి మాకుల
వన్నె మదరసము వడిసీఁ జెలియా

చ. 3:

సరి మోవులనె వసంతపు చిగురుల
పరగుఁ గుచము లను ఫలములను
యిరవై శ్రీ వెంకటేశ నినుఁ గలసి
పొరిఁ బొరి విందుల పూచీఁ జెలియా