పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0288-6 పాడి సం: 09-228

పల్లవి:

ఎవ్వరి బలువెక్కుడో యిద్దరిలోన
రవ్వగా నానతీవయ్య రామచంద్ర మాకు

చ. 1:

చెక్కిటఁ బెట్టిన చేయి సేతువుగట్టినకట్ట
చక్కని సీతాచింతాజలధికిని
పెక్కు కొండలచే నీవు పెనచి కట్టించితివి
వొక్కమాటె ఆపె అయితె నుండుమంటె నుండెను

చ. 2:

ముంచి చెలి పులకింపు మోహవనవాసము
మించిన విరహముల మితిమేరకు
సంచరించి నీవైతె జగమెల్ల నిండితివి
యించుకంతలోన నాపె యీడనుండె నిండెను

చ. 3:

వొట్టిన నీకాఁగి లయోధ్యలోని పట్టము
నెట్టన శ్రీవెంకటేశ నీ దేవికి
ఱట్టుగా నీ వింతలో నాఱడి రాజ్య మేలితివి
యిట్టె మరురాజ్యమేలే యీ యింతి రతులను