పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0288-4 ధన్నాశి సం: 09-226

పల్లవి:

కోరి చేకొనఁగరాదు కోపగించు కొనరాదు
యీరీతి విచ్చేసితివి యేడనుండో యీడకు

చ. 1:

పొదిగేవు వొకవేళ పొరలేవు వొకవేళ
అదిబిదుకు వలపు లవియాల
వెదకితి మాపునంత వేగించితి వేగునంత
యిదిగో విచ్చేసితివి యేడనుండో యీడకు

చ. 2:

మనసువ చ్చొకమాట మనరా కొక మాట
అనుమానపు చెనకు లవియాల
చనవు చల్లితిగొంత సరస మాడితిగొంత
యెనయ విచ్చేసితివి యేడనుండో యీడకు

చ. 3:

చేయిచాఁచే వప్పటిని సిగ్గువడేవు కమ్మటి
ఆయ మెరఁగని రతు లవియాల
పాయక శ్రీవెంకటేశ పైకొని కూడితి విట్టె
యీయడ మేలుకొంటివి యేడనుందో యీడకు