పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0287-6 పాడి సం: 09-222

పల్లవి:

ఇంతిమాటలకు నేల యెగ్గు పట్టేవు
చెంతల నాపె చనవు చెల్లించరాదా

చ. 1:

అగపడి లోనైతె అన్ని నవ్వులె కాక
యెగసక్కే లాడే నంటే యెంతలేదు
చిగిరించినట్టి వేళ జిగిఁ బండినట్టి వేళ
వొగరుఁ దీపునుఁ దోఁచు నొక్కటందే కాదా

చ. 2:

సరిఁ జుట్టరికానకు సరసాలె అన్నియును
యెరవులు సేసుకొంటే నెంతలేదు
తొరలఁ గాఁచినప్పుడు తోడంటు వెట్టినప్పుడు
పెరుగుఁ బాలును నొక్క పేరుపునే కాదా

చ. 3:

కొయ్యవై శ్రీవెంకటేశ కూడుకొంటి వాపె నిట్టె
యియ్యకోలు సేసుకొంటే నెంతలేదు
చయ్యన దంచినచోట చవిగా వండినచోట
బియ్యము వంటకమై బెరసేదే కాదా