పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0287-2 దేసాళం సం: 09-218

పల్లవి:

అప్పటి నమ్మఁడు తన్ను నటు వెంగి లాడే నంటా
యిప్పుడూ నానవెట్టెను యింకనేలె నవ్వులు

చ. 1:

బాగాలు వెట్టరె పైకొని విభునికి
వాగమై యింతుల కెల్లా వలపు మని
యీగతి మూసి మంతనా లిన్నాళ్లుఁ దనకు
వేగమె యప్పణిచ్చితి వెరుపేలె యిఁకను

చ. 2:

వుపమ లెత్తియ్యరె వొకటొకటె పతికి
నెపాన సతులఁ బొంద నేరువు మని
కపటాన దాఁ గొంత కనియుఁ గానము లేల
యెపుడూఁ దనకు లోనె యిఁక నేలె కొంకను

చ. 3;

చేయెత్తి మీరు మొక్కరె శ్రీవెంకటేశ్వరునికి
పాయపువారి మనసు పట్టుమని
యీయెడఁదా నన్నుఁగూడె యిచ్చకము సేసుకొని
నాయము నేనె చెప్పేను ననుపాయ నిఁకను