పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0287-1 నాదరామక్రియ సం: 09-217

పల్లవి:

ఎటువంటి మోహమో యీపెకు నాతని మీఁద
ఘటియించె నిద్దరికి కందువ వేడుకలు

చ. 1:

సంగడిఁ గూచున్నది చనవు చేకొన్నది
అంగపుఁ జెమట నోల లాడినది
యెంగిలిపొత్తున విడే లిచ్చినది మెచ్చినది
పంగించీ నిందిరాదేవి ప్రహ్లాదవరదుని

చ. 2:

మొక్కుచు నవ్వినది ముచ్చట లాడినది
యిక్కువ లంటుచు లోలో నెన సున్నది
చెక్కుఁ జెక్కుఁ గదియించి జిగిఁ బులకించినది
చిక్కించీఁ గమలాదేవి శ్రీనరసింహునిని

చ. 3:

కనుసన్న చేసినది కాఁగిట నించినది
తనివార రతులను దక్కఁ గొన్నది
చెనకి యహోబలాన శ్రీవెంకటాద్రి మీఁద
ననిచె శ్రీమహాలక్ష్మీ నరమృగదేవుని