పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0286-3 దేశా(సా)క్షి సం: 09-213

పల్లవి:

తా నదివో నే నిదివో తారుకాణ లైతిమి
మోనముతోడ నవ్వరే మోవులనవ్వూ

చ. 1:

ఆడ నీడ నుండి వచ్చీ అలసి సొలసి మెచ్చీ
వేడుకకాని కియ్యవే విడె మిదిగో
నీడనుండె అలసీని నిలుచుండె కలసీని
పాడితోడనె మొక్కరే పండుగమొక్కు

చ. 2:

చేయఁగలవెల్లాఁ జేసీ చేరి నాపైఁ జెయి వేసీ
పాయపు వాని కియ్యరే బలు కట్నాలు
చాయలకె మాటలాడి సన్నలకె పాట పాడీ
దాయముగాఁ జూడరే సంతసపుఁ జూపు

చ. 3:

కాంతలలోన వెలసీ కాఁగిట నన్నుఁ గలసీ
పంతగాని పై జల్లరే బలు సేసలు
యింతలో శ్రీవెంకటేశుఁ డితఁడిదె నన్నుఁ గూడె
వింతగా విందు చెప్పరే వియ్యపు విందు