పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0286-1 శ్రీరాగం సం: 09-211

పల్లవి:

వలపులా గటువంటిదివో
పిలిచేటి ప్రియమున బీరము మఱచె

చ. 1:

వెలఁది‌ నిన్నుఁ గని వేడుకతోడను
అలుక లన్నియును నటు మఱచె
నలుగడ నీతో నవ్వెటి సందడి
చలములు లోలో సాదించ మఱచె

చ. 2:

యింతి విడె మిదె యిచ్చె పరాకున
పంతపు టొట్లపని మఱచె
చెంతల నినుఁ గడు చెనకే సొబగున
కొంతయినఁ దొల్లిటి కోపము మఱచె

చ. 3:

కొమ్మ కాఁగిటను కూడే తమకమున
సమ్మతి జంకించఁగ మఱచె
యిమ్ముల శ్రీవెంకటేశ కలసితివి
చిమ్ముల యెరవులు సేయఁగ మఱచె