పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0284-5 ఆహిరి సం: 09-209

పల్లవి:

ఇద్దరుఁ గూడినమీఁద నిఁక నేఁటి సుద్దులే
పొద్దు వొద్దు కాతఁడు బుజ్జగించఁగాను

చ. 1:

తమకించే వేఁటికె తా నిన్న రానియందుకు
అమర నాతఁడు నీతో నానతీఁగాను
చెమరించే వేఁటికె చెక్కు నొక్కి యాతఁడు
జమళి వేఁడుకొని యిచ్చకము సేయఁగాను

చ. 2:

పచ్చిసేయ నేఁటికె పరాకై తా రున్నందుకు
చెచ్చెర నాతఁడు నిన్నె చెనకఁగాను
మెచ్చ వింకానేఁటికె మేకుల నిన్నుఁ బొగడి
వొచ్చముదీర నాతఁడు వుపచరించఁగను

చ. 3:

ఆరీతి యింకేఁటికే అన్ని చేఁతలకు నిన్నుఁ
గోరి శ్రీవెంకటేశుఁడు కూడఁగాను
బీరములు మానవె పెనఁగి నిన్నుఁ గలసి
ఆరసి యీతఁడె నీకు నందాలు చెప్పఁగనూ