పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0285-3 సాళంగనాట సం: 09-207

పల్లవి:

పిలువవచ్చిన నేను పెంట వెట్టుకొన్నదాన
తలఁపు నీ కెట్టున్నదో దంటఁగాను నేను

చ. 1:

కామినులతోడి మాట కలది కలట్టేకాని
కోమలపు కల్లలైతె కోపగింతురు
జామాయ నీవద్దనుండి సరినాపెతో నేమందు
నీమతకము లేఁటివో నే మెరఁగ మిఁకను

చ. 2:

వలచినవారిపొందు వచ్చినట్టె వచ్చుఁగాని
కొలఁదికి రాకున్న కొసరుదురు
నెలకొంటి నిక్కడ నేనె నాపె నెట్టు నమ్మింతు
యెలమి మీ కిద్దరికి నెదురాడ నోపను

చ. 3:

యిల్లాండ్ల కన్నియును యియ్యకోలై వుండుఁగాని
జల్లించి సందుగలితే సాధించరు
యిల్లిదె నన్నుఁ గూడి యింట నాపెఁ గూడితివి
వొల్లనె శ్రీవెంకటేశ వూరకుండే నిపుడు