పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0284-4 శ్రీరాగం సం: 09-202

పల్లవి:

ఇటువంటి నీ భాగ్య మేమని చెప్పుదుమమ్మ
తటుకనను నీపతితపము లీడేరె

చ. 1:

చెక్కుల మకరాంకము జిగిఁగన్నుల మచ్చములును
మిక్కిలి శంఖము మెడను మీఁగాళ్లఁ గచ్చపములు
చిక్కని నీరూపఁపు సింగార జలనిధికిని
నెక్కొని తామొనరి నవనిధులాయఁ గదవే

చ. 2:

వదనమునఁ బద్మంబు వరము కుచగిరులకును
అదె దంతములఁ గుందము లలకము లనిలములు
అద నెరిఁగి నిలిచి నీయవ్వనపు జలనిధికి
పొదిగి నవనిధులగుచుఁ బొడమె నదె కదవే

చ. 3:

కాఁగిటను శ్రీవెంకటగిరి ముకుందంబు
మూఁగిన వరము లెల్ల ముంగిటందు
చేఁగమీరిన రతులచెమట లను జలనిధికి
ఆఁగి యిటు నవనిధులు నాయఁ గదవే