పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0284-2 బౌళి సం: 09-200

పల్లవి:

నివ్వెరగై వున్నాఁడవు నే మెంత పిలిచినా
మువ్వంక వలపులు ముంచకుండీనా

చ. 1:

సొలసి సొలసి నిన్నుఁ జూచిన యీ చెలిచూపు
నలిరేఁగి నీ మతిలో నాటకుండీనా
మలసి మలసి యిట్టె మాటలాడిన మాట
కలసి నీ మర్మాలు కలఁచకుండీనా

చ. 2:

చిమ్ముచుఁ జిమ్ముచు నింతి చెనకిన చెనకులు
కిమ్ముల నిన్నిట్టె గిలిగించకుండీనా
కమ్మరఁ గమ్మర నీతో కందువ నవ్విన నవ్వు
దిమ్మురేఁచి నీగుణము తేలించకుండీనా

చ. 3:

కరఁగి కరఁగి కాంత కాఁగిలించిన కాఁగిలి
అరమరపించి ఆయా లంటకుండీనా
యిరవై శ్రీవెంకటేశ యిద్దరి మమ్ముఁ గూడితి
గరిమ నీకిట్టె తారుకాణగాకుండీనా