పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0284-1 రామక్రియ సం: 09-199

పల్లవి:

తొలుతె మీతమకము దోసిటిపాలు
అలరి యింకాఁ బెండ్లి ఆడవయ్య యిపుడు

చ. 1:

సతికి నీకుఁ జూపుల సరిపొంతనాలుగూడె
చతురత మాట లనె సందివిడేలు
మతకరినవ్వు లనె మంచి పాశాల విందులు
అతిశయమగుఁ బెండ్లి ఆడవయ్య యిపుడు

చ. 2:

యింతికి నీకు వయసు లిరువంకఁ గంకణాలు
పంతపుఁ దమకములె బాసికములు
కొంతఁ గొంత లేఁతసిగ్గు కొంగులువేసిన ముడి
అంతలో వేడుకపెండ్లి ఆడవయ్య యిపుడు

చ. 3:

నంటుతోడి సరసాలు నాగవల్లి సోబనాలు
పెంటలైన సమరతి పట్టిన పేఁట
యింటిలో శ్రీవెంకటేశ యీయలమేల్మంగను
అంటి ముట్టి మంచిపెండ్లి ఆడవయ్య యిపుడు