పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0283-6 సౌరాష్ట్రం సం: 09-198

పల్లవి:

ఇద్దరిఁ గూర్చినవారు యిప్పుడు మీరెకారా
వొద్దిక్క నప్పటి నేల వొరపులాడేరే

చ. 1:

కచ్చుపెట్టి నే నతనిఁ గన్నులఁ బిలిచితేను
యిచ్చటఁ జెలులు మీరు యేల నవ్వేరే
ముచ్చటమాటులఁ గడు మోహముపైఁ జల్లితేను
పచ్చారుచుఁ జెలు లేల పచ్చిసేసేరే

చ. 2:

పాయక నే నాతనిపయిఁ జెయివేసితేను
చాయల మీలో నేల సన్న లాడేరే
ఆయము లెరిఁగి నే నాకు మడిచియ్యఁగాను
వేయేసిలాగుల నేల వెంగేలాడేరే

చ. 3:

భావించి శ్రీవెంకటేశుపాదాలు నే నొత్తితేను
వేవేగ సిగ్గున నేల వెలి నుండేరే
ఆవటించి కూడితిమి అప్పుడే మీరు లోనికి
యీవేళ వచ్చితి రింక నిట్టె వుండరే