పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0283-4 మధ్యమావతి సం: 09-196

పల్లవి:

అన్నిటా భాగ్యవంతుఁడ వాయమెరిఁగి కూడితి
యెన్నికలు మీరితేను యెట్టుండునో సుద్దులు

చ. 1:

చింతలనె కొంతపొద్దు చెక్కిటిచేఁ గొంతవొద్దు
కాంతలతోఁ గొంతవొద్దు గడపెఁ జెలి
యింతలో నీవు విచ్చేసి తిన్నియును లెస్సలాయ
యెంతలేసి పను లౌనో యించు కూరకుండినా

చ. 2:

యెదురుచూచే యాస నిల్లుసింగారించే యాస
వెదకేటిఁయాస గొంత వెలసెఁ జెలి
అద నెరిఁగి దగ్గరి అంతలో నీవు నవ్వితి
యెదుగా సరసమైతే నెన్నేసివిధులో

చ. 3:

చూపులనె కొంతరతి సుద్దులనె కొంతరతి
యేపులనె కొంతరతి నెనసెఁ జెలి
పై పై శ్రీవెంకటేశ భామ నిట్టె కూడితివి
యీపొద్దు లివిదక్కె నింకా నెంతదక్కునో