పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0283-3 ముఖారి సం: 09-195

పల్లవి:

మేలు నీతోడి పొందులు మేకు లాయను
వేళ వేళ నీ సతికి వింత లాయను

చ. 1:

చిల్లరగా చెలి నీతో సెలవుల నవ్వఁబోతే
వెల్లవిరులై పెద్ద వెన్నె లాయను
చల్లని నీ సరసాలు జాలువారి జాలువారి
యిల్లిదివో వలపుల యేరు లాయను

చ. 2:

మంతనాన నీతోను మాటలాడఁ బోతేను
చింతదీర నీపె కవె సిగ్గు లాయను
చెంత నీతో సంగాతాలు చిమ్మిరేఁగి చిమ్మిరేఁగి
కాంతుల మరుబాణాలు గను లాయను

చ. 3:

సమ్మతించి యింతి నిన్నుఁ జక్కఁ జూడఁ బోతేను
కుమ్మరింపుఁ దమకపు గురు లాయను
కొమ్మకు శ్రీవెంకటేశ కూడిన నీ కూటములు
దొమ్ము లాసల రతుల దొంతు లాయను