పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0282-2 శుద్దవంతం సం: 09-192

పల్లవి:

ఎంతమాట కెంత సేసే వేమీ నీవు
పంతాలు నెరపఁ బోతే పసచూప నున్నదా

చ. 1:

చేసుకొన్న చెలిగాన చేకొని కొసరితే
యీసులు రేఁచుకొనే వేమీ నీవు
ఆసగలవాఁడ వైతె నన్నిటి కోరుతు గాక
వేసరుకొనేవు నీకు విన్నవించ నున్నదా

చ. 2:

వొరసి సతి నీతోడ నూరకే అటుండితేను
యెరవులు సేసుకొనే వేమీ నీవు
కరఁగ నేరిచితేను కైవసమై వుందు గాక
పొరలఁ జూచేవు యిఁక పొందు సేయ నున్నదా

చ. 3:

తగవులకాంత నీతో తచ్చనలు నెరపితే
నెగసక్కే లంటా నవ్వే వేమీ నీవు
నిగిడి శ్రీవెంకటేశ నేఁడు నన్నుఁ గూడితివి
మొగము చూచేవు నీతో మూసి దాఁచ నున్నదా