పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0282-4 నాట సం: 09-190

పల్లవి:

పై పై నిన్నుఁ గొసరితే పసురే కాదా
వైపులు సేసుక నే నే వద్దనుండేఁ గాకా

చ. 1:

యిచ్చకము లాడఁగానె యిటు రమ్మనేవు గాక
చెచ్చెర నిజ మాడితే చేర నిచ్చేవా
పచ్చిగాఁగ నీగుణము పచరించ నేమున్నది
కొచ్చి నా నేరుపుననె గుట్టుసేసేఁ గాకా

చ. 2:

చాయచేసు కుండఁగానె చవులై వుందానఁగాక
నాయము నడపు మంటే నన్ను మెచ్చేవా
సోయగాన నిన్నంత సోదించ నేమున్నది
తీయని మాటాడి నిన్ను తిద్దుకొనేఁ గాక

చ. 3:

కదిసి నేఁ గూడఁగానె కరఁగి‌ చొక్కేవు గాక
వదరి నే నూరకున్న వస మయ్యేవా
అదె శ్రీ వెంకటేశుఁడ అలమేలుమంగ నేను
పొదిగి నేనుండఁగానె భోగించేవు గాకా