పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0282-1 సాళంగం సం: 09-187

పల్లవి:

ఇదివో వలపు చింది యినుమ డాయను
యెదుట నీభాగ్య మాయ నిఁక నేఁటిదయ్యా

చ. 1:

చెలియ నీ వింటికి విచ్చేసిన పరాకున
మలసి పయ్యద వెట్ట మరచె నదే
వెలయ నీ వింతలో నవ్విన నవ్వులకు నిట్టె
చలివాసి తన కొప్పు జారుటా నెరఁగదు

చ. 2:

పడఁతి నీ చూపులు ఫైఁ బారిన సంభ్రమమున
బడినె పాయపు సిగ్గుపడ మరచె
జడియక నీ వంతలో సరసము లాడితేను
వొడలఁ జెమట నిండి వొలుకుట చూడదు

చ. 3:

వేవేగ నీవు గూడిన వేడుక నలమేల్‌మంగ
శ్రీవెంకటేశుఁడు తనచేఁత మఱచె
భావించి నీవంతలోనె పైపై నెచ్చరించఁగాను
ఆవటించి తన మేని అలయికఁ గానదు