పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0281-4 భైరవి సం: 09-184

పల్లవి:

ఏల సిగ్గు వడే వానతియ్యరాదా
మేలిమిచెలుల మిదె మీవారమె

చ. 1:

తురుము నీవియు జార తొయ్యలి యెదురుకొనె
యిరవగు పతివి నీ వింటికి రాఁగా
పరగఁ జూచితి మాపె పట్టరాని సంతోసము
సరవి నీ మనసు యే చందమో యిపుడు

చ. 2:

కన్నులా నోరా వినెను కాంత నీవు మాటాడఁగా
సన్నపుఁ జిరునవ్వులు జాలు వారఁగా
మున్నె యెరిఁగితి మాపె మోహ మింత గలదని
పన్నిన నీగుట్టు యేరుపడ దింతే కాని

చ. 3:

చేతులాఁ జన్నుల నిండాఁ జెలి యప్పళించుకొనె
ఘాతల శ్రీవెంకటేశ కాఁగిలియ్యఁగా
యీతలఁ దెలుసుకొంటి మీ యలమేల్మంగ యాస
యేతుల నీ యాకతము లెట్టుడెనో