పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0281-2 సామంతం సం: 09-182

పల్లవి:

ఎగ్గో తప్పో యెఱఁగ నిది
నిగ్గులు దేరఁగ నినుఁ బైకొందు

చ. 1:

పలుమరు నీతోఁ బంతము లాడను
అలసి సొలసి మాటాడుదును
కులికి కులికి నినుఁ గోపించి చూడను
నలుగడఁ గూరిమిఁనాఁటఁగ జూతు

చ. 2:

కమ్మర నీపై కాఁకలు చల్లను
సమ్మతి వలపులు చల్లుదును
దిమ్మురేఁచి తరితీఁపులఁ బెట్టను
కొమ్మని మేకులు కొనఁ బెట్టుదును

చ. 3:

పాసివుంటి వని బడలిక సేయను
ఆసల రతులనె అలయింతు
సేసలఁ గూడితి శ్రీవెంకటేశ్వర
వేసరించ నిను విడువ నెప్పుడును