పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0280-6 పాడి సం: 09-180

పల్లవి:

అన్నియు నందె అమరె నదె
సన్నపునవ్వులు చల్లే నిపుడు

చ. 1:

చెక్కు నొక్కి నను సేదదేర్చి యిటు
దిక్కనఁ గోపము దీర్చితివి
యెక్కువ నినుఁ దొలు తేమని యంటినో
చిక్కి కాఁగిలించెద నే నిపుడు

చ. 2:

చనవులిచ్చి నను సమతు సేసి యిటు
పెనఁగి మంకు విడిపించితివి
యెనయ నపుడు నిను నెంతసేసితినో
చెనకి యధర మిచ్చెద నే నిపుడు

చ. 3:

సరసమాడి కడుఁ జవులుచూపి యిటు
గరిమతోడ ననుఁ గలసితివి
సరవి శ్రీవెంకటేశ్వర యే మెరఁగనో
అరసి తనిసి కొనియాడెద నిపుడు