పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0280-3 దేసాళం సం: 09-177

పల్లవి:

ముగురము జాణలమే మోహమెవ్వరి దనేది
నిగిడి నామోము చూచి నీవేల లోఁగేవు

చ. 1:

యింతి తెంకాయ కానుక యిచ్చె నీవు గైకొంటివి
యింతలేసి యాపె కుచాలివి యంటాను
సంతమై యిద్దరి సన్న సరికి బేసికి వచ్చె
అంతటి మీ నేరుపుల కట్టె నేను మెచ్చితి

చ. 2:

దొండపండు కానుకిచ్చె తోడ నీ వందుకొంటివి
దండ నిటువంటిదె యధరమనుచు
దండి మీపొదరులవి తాసుగట్లెయు నాయ
అండ నుందానఁ గాన అట్టె నేమెచ్చితి

చ. 3:

పువ్వుగుత్తి కానుకిచ్చెఁ బుచ్చుకొని కూడితివి
జవ్వనము ఆపెకు యీజాడ దంటాను
అవ్వలి మోమైవుండి అప్పుడె శ్రీవెంకటేశ
యివ్వలఁ గాఁగిలించి మీయిద్దరి మెచ్చితిని