పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0280-2 కేదారగౌళ సం: 09-176

పల్లవి:

అందుమీఁద మేలుదాన వాతనికి నీవు దొల్లె
కందువె చూతువుగాక గరిసించ నేఁటికే

చ. 1:

చిక్కని వెన్నెలతేట చెలియ నీ మొగమోట
అక్కజపు పతి నింకేమనఁగలవే
నిక్కి యాతఁడన్నీఁజేసె నీపై వలపువేసె
మక్కువ నాడ సుద్దులు మమ్మే మడిగేవే

చ. 2:

పచ్చితేనె కులుకులు పడఁతి నీపలుకులు
యిచ్చట నాతని నింకా నేమనేవే
రచ్చలకు నాఁడెయెక్కె రాతిరి నీకు మొక్కె
ముచ్చట కిందేమి మామోములు చూచేవే

చ. 3:

చెప్పరాని విందులు సేసెటి నీ పొందులు
యిప్పుడు శ్రీవెంకటేశు నేమిసేసేవే
తప్ప కితఁడె కలసె తమకములు వలసె
వొప్పుగా మమ్ము మెచ్చితి వొరయ నేమిటికే