పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0279-6 పాడి సం: 09-174

పల్లవి:

కన్నులఁ జూచేవు మాతొ కందువ మాటలాడేవు
కొన్నదికోలు నీకిఁక గోవిందరాజా

చ. 1:

పవ్వళించేయప్పుడూను పాదాలొత్తే వారిద్దరు
యివ్వల నే నీతో నవ్వ నేకతమేది
దవ్వుల నుండే మమ్ముఁ దడవేవు నీవొళ్ల
కువ్వలాయ వలపులు గోవిందరాజా

చ. 2:

యిద్దిరి చే నిమ్మపండ వేమి సేయవచ్చు నిన్ను
అద్ది నీతో మాటలాడ ననువయ్యీనా
చద్దికి వేఁడి కప్పటి జాణతనా లాడేవు
కొద్దిఁబడవు పనులు గోవిందరాజా

చ. 3:

యిరుమొనసూదివి యెవ్వరివాఁడ వందుము
దొరవై నన్నుఁ గూడితి తొల్లె నీవు
తరవాతి చేఁతలెల్ల దక్కె నీకు నిందరిలో
గొరబై శ్రీవెంకటాద్రి గోవిందరాజా