పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0279-5 దేసాక్షి సం: 09-173

పల్లవి:

వినవమ్మ యశోద గోవింద కృష్ణుఁడు
చెనకి యెన్నిపనులు చేసెనమ్మ కృష్ణుఁడు

చ. 1:

వుట్టులు దాఁగొట్టుఁగాను వువిదలు దిట్టఁగాను
ఱట్టాయ వీథులలో నుఱక కృష్ణుడు
పట్టినకోలల గొల్లపౌఁజు లిరువంకరాఁగ
పట్టుకొన్న గొల్లెతల భ్రమయించీఁ గృష్ణుఁడు

చ. 2:

పాలు దనపై గారఁగా పడఁతులు నవ్వఁగాను
గేలికి లోనాయను జంగిలి కృష్ణుఁడు
అలరి యెలుఁగులతో నడ్డమువచ్చినవారి
మేలపు చేఁతలు చేసి మెప్పంచీఁ గృష్ణుఁడు

చ. 3:

యిండులు దాఁజొరఁగాను యింతులు పైకొనఁగాను
బండుకు లోనాయను గోపాలకృష్ణుఁడు
అండనె శ్రీవెంకటాద్రి నలమేలుమంగ గూడి
దుండగపుఁ జేఁతలనె దొరాయఁ గృష్ణుఁడు