పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0279-4 పాడి సం: 09-172

పల్లవి:

ఆపెకు నీకుఁ దెలుసు నటమీఁది పనులెల్లా
చేపట్టినే మింతకంటెఁ జెప్పఁగఁ జోటేది

చ. 1:

లోకములో నెవ్వతైనా లోఁచి మాటలాడఁగాను
పైకొనవి వానికిఁ బంతమేది
రాకలఁ బోకల నట్టె రాయడించి కొసరఁగ
మైకొని లోఁగాకున్న మగతనమేది

చ. 2:

నంటున నెవ్వతెయైనా నవ్వులు సారె నవ్వఁగా
యింటికి రాకున్నవాని యెరుకేది
జంటలఁ దనమొకము సారె సారెఁ జూడఁగాను
వెంటఁ దగులకున్నను విటతనమేది

చ. 3:

యెమ్మెచూపి యెవ్వతైనా యెదుటనే నిలుచుంటే
నెమ్మిఁ గలయనివాని నేరుపేది
కొమ్మను శ్రీవెంకటేశ కూడి నన్నుఁ గూడితివి
సమ్మతి నిటుగాకున్న జాణతనమేది