పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0279-3 కాంబోది సం: 09-171

పల్లవి:

చాలుఁ జాలు నేల మాతో జాణతనాలు నాకు
కోలుముందై నీపొందు జిగురువంటిదయ్యా

చ. 1:

చెచ్చెర నీమాఁటలు చెవియొగ్గి వినఁబోతే
మచ్చిక నల్లాపె నీకె మరులాయను
హెచ్చుగాఁ బదారువేల నీరీతిగడించుకొంటి
తెచ్చి నీకు నెవ్వ రుపదేశమిచ్చిరయ్యా

చ. 2:

ముందరనుండఁగ నీమొగము చూడఁగఁబోతే
అందరిలోపల నాపె ఆలాయను
యిందువంకనె రేపల్లె యింతుల భ్రమించితివి
సందడి నెవ్వరు నిన్నుఁ జదివించిరయ్యా

చ. 3:

చేరువ నీవుండఁగా నీసేవలు సేయఁగఁబోతే
సారె నీవురాన నాపె సతమాయను
యీరీతి శ్రీవెంకటేశ యిల్లాండ్లఁ దెచ్చుకొంటే
నేరిపి యెవ్వ రింతేని నిన్ను దిద్దిరయ్యా