పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0279-1 నాదరామక్రియ సం: 09-169

పల్లవి:

ఒలసితే నొకమాట వొల్లకుంటే నొకమాట
బలిమి వలపులకు పాటియేది యిందుకు

చ. 1:

చెక్కు నొక్కి వేఁడుకో నీచే సూటికి రాకున్న
కక్కసించి యేరా నీవు కడుఁ దిట్టేవు
యెక్కువ నీ వొక్క నోరె యెందుకైనావచ్చు నిఁక
నిక్కమేది కల్లయేది నేనెట్టు నమ్మేను

చ. 2:

నవ్వు నవ్వి చేయి వేసి నయ మింతలేకున్న
పవ్వళించి యేరా నీవు పగచాటేవు
రవ్వగా నీగుణమిదె రండూ నడపఁజొచ్చె
యివ్వల నీయెడమాట లేమివినే మిఁకను

చ. 3:

అట్టె నన్నుఁ గాఁగిలించి అన్నిటాఁ గిందుపడితే
జట్టిగొని తొల్లిటివోజకు వచ్చేవు
నెట్టన శ్రీవెంకటేశ నీవు నేను నొక్కటే
యిట్టు నట్టు నందాలకు నిన్ని నేరుతువు